Friday, November 22, 2024

Big Story: తెలంగాణలో పెరిగిన స్టూడెంట్‌ డ్రాపౌట్స్‌.. చివరాఖరున భూపాలపల్లి జిల్లా

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్ర వ్యాప్తంగా బడికి దూరంగా ఇంకా వేలాది మంది విద్యార్థులు కనిపి స్తున్నారు. పుస్తకం పట్టకుండా అక్షర జ్ఞానానికి దూరం గా ఉంటున్నారు. మరీ ముఖ్యంగా హైస్కూల్‌ స్థాయిలో విద్యార్థుల డ్రాపౌట్‌ రేటు ఎక్కువగా ఉంది. అయితే ఇది ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలల కంటే ఉన్నత పాఠశాలల్లోనే డ్రాపౌట్‌ రేటు ఎక్కువగా ఉంది. హైస్కూల్‌ చదివే విద్యార్థులే ఎక్కువగా బడిని మధ్యలో మానేసినట్లుగా తెలు స్తోంది. తెలంగాణ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ తాజాగా విడుదల చేసిన తెలంగాణ స్టేట్‌ స్టాటిస్టికల్‌-2021లో ఈ గణాంకాలు వెల్లడించింది. 2019-20 నాటికి ఉన్నత పాఠశాలల్లో రాష్ట్ర వ్యాప్తం గా మొత్తం డ్రాపౌట్‌ రేటు 12.29 శాతంగా నమోదైం ది. నివేదిక ప్రకారం రాష్ట్రంలో 2019-20లో మొత్తం 40,898 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 20,752 ప్రాథమిక పాఠశాలలు (1 నుంచి 5 తరగతులు) , 7,471 ప్రాథమికోన్నత (6 నుంచి 8), 11,921 ఉన్నత పాఠశాలలు (9, 10), 754 హైయ్యర్‌ సెకండరీ స్కూల్స్‌ (11, 12) ఉన్నాయి.

హైస్కూల్‌ స్థాయిలో వివిధ రకాల కారణాలతో మధ్యలో చదువు మానేసి బడిబయట ఉన్న విద్యార్థుల్లో 29.49 శాతంతో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్టచివరి స్థానంలో ఉంది. ఆ తర్వాత 25.69 శాతంతో జోగులాంబ గద్వాల జిల్లా ఉండగా, సంగా రెడ్డి-23.42 శాతం, మహబూబాబాద్‌-23.09 శాతం, వరంగల్‌-21.64 శాతం, ములుగు-21.59, వికారా బాద్‌-20.68 శాతం, యాదాద్రి భువనగిరి- 19.77 శాతం, జగిత్యాల్‌-19.40 శాతం, మెదక్‌- 19.23 శాతంతో ఇవి చివరి పది స్థానాల్లో నిలిచాయి. అయితే ఆదిలా బాద్‌, హన్మకొండ, కరీంనగర్‌ జిల్లాలో మాత్రం సున్నా శాతంగా విద్యార్థుల డ్రాపౌట్‌ నమోదైంది. ఇది అక్కడి విద్యాధికారులు, ఉపా ధ్యాయుల కృషికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో చూసుకుంటే హైదరాబాద్‌ జిల్లాలో 3.59 శాతం, రంగారెడ్డి జిల్లాలో 8.38 శాతం, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో 18.67 శాతంగా ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల డ్రాపౌట్‌ నమోదైంది. మిగితా జిల్లాల్లోనూ 18 శాతం వరకు డ్రాపౌట్‌ ఉంది. ఇదిలా ఉంటే ప్రాథమిక విద్యాలో డ్రాపౌట్‌ రేటు సున్నాగా నమోదవ్వడం గమనార్హం. అలాగే ప్రాథమికోన్నత పాటశాలల్లోనూ 0.06 శాతంగా నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement