కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సరైన కమ్యూనికేషన్ పెట్టుకోవడం లేదని, బలమైన కేంద్రం, బలహీనమైన రాష్ట్రాలు ఉండడమే ఆర్ ఎస్ ఎస్, బీజేపీ సిద్ధాంతం అని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. కేబినెట్ భేటీ తర్వాత ఇవ్వాల ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో చేపట్టే పలు అభివృద్ధి పనులు, సాహసోపేత నిర్ణయాలను తెలిపిన తర్వాత ఆయన కేంద్ర ప్రభుత్వ వైఖరి, బీజేపీ అనుసరిస్తున్న విధానాలపై మండిపడ్డారు.
మీరు పెట్రోల్ రేటు పెంచుతరు.. మేం తగ్గించుకోవల్నా.. ఇదేం పద్ధతి. ఇదేం పాలన.. మీది నోరా, మోరా.. బడా వ్యాపారులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాపాడుతోంది. పేదలను మాత్రం ధరలు పెంచి ఇబ్బంది పెడుతోంది. పనికిమాలిన, దిక్కుమాలిన ఆరోపణలు. అరాకిరి మాటలు పెడబొబ్బలు, ఇదేనా మీ పాలన. కేంద్ర మంత్రి, భారత ప్రధాని తీరు ఇట్లనే ఉంటదా.. రైతుల పట్ల, దేశ ప్రజల పట్ల మీ విధానం ఇట్లనే ఉంటదా. అని కేసీఆర్ మండిపడ్డారు.
తెలంగాణ రైతులను అవమాన పరిచారు. నూకలు తినమని మమ్మల్ని హేళన చేశారు. కేంద్రం మంత్రికి ఎంత అహంకరాం. కేంద్రం యాంటీ ఫెడరల్ సిద్ధాంతాన్ని పాటిస్తోంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు కనీసం బుద్ది ఉందా.. మీ అనాలోచిత నిర్ణయాలతో దేశ రాజధానిలో రైతులు 13 నెలలు ఉద్యమించారు. ఎండా, వాన, చలి అనకుండా రోడ్లమీద ఇబ్బందులు పడ్డారు. మీ నిర్ణయాలు అంత దారుణంగా ఉంటాయి. దీంతోటి కేంద్రం దిగొచ్చింది. దేశ ప్రధాని యావత్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు..