Monday, November 25, 2024

TS | రూల్స్‌కు మించి తరుగు తీయొద్దు.. మిల్లర్లకు సీపీ స్వీట్​ వార్నింగ్​

వ‌రంగ‌ల్ క్రైమ్‌, (ప్ర‌భ న్యూస్‌): వ‌డ్ల కాంటా విషయంలో ప్రభుత్వ నిబంధనలకు మించి తరుగు తీస్తే, సదరు రైస్ మిల్లుల‌పై క‌ఠిన చ‌ర్య‌లుంటాయ‌ని వరంగల్ పోలీస్ కమిషనర్ హెచ్చ‌రించారు. ధాన్యం తూకం అంశానికి సంబంంచి రైస్ మిల్ అసోసియెషన్ సభ్యులతో ఇవ్వాల (మంగళవారం) ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. వరంగల్, జనగాం, హనుమకొండ జిల్లాలకు చెందిన రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు సందర్భంగా తూకం విష‌యంలో రైస్ మిల్ యాజమాన్యం నిర్వ‌హిస్తున్న తీరుపై చ‌ర్చించారు.

అనంతరం.. సీపీ రంగ‌నాథ్ మాట్లాడుతూ.. శాంతి భద్రతల అంశాన్ని దృష్టిలో పెట్టుకోని ధాన్యం తూకం విషయంలో పోలీస్ జోక్యం కలిగించుకోవడం జరుగుతోందన్నారు. కొద్ది రోజులుగా ఐ.కె.పి కేంద్రాల నుండి మిల్లులకు తరలిపోయిన ధాన్యం తూకం విషయంలో ఇబ్బందులు త‌లెత్తుతున్నాయ‌ని, మిల్లు యాజమాన్యం తప్పుడు విధానాలతో ఎక్కువ మొత్తంలో తరుగు తీయడం సరికాదన్నారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి తరుగు తీయాలని, రైస్ మిల్లు యాజమాన్యం పారదర్శకంగా ఉండాల‌న్నారు. మిల్లులో జరుగుతున్న కార్యకలపాలపై రైతుల నుండి ఫొటోలు, వీడియో వంటి దృష్యాలు అందుతున్నాయని సీపీ తెలియజేసారు. అందుక‌ని ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు పాటించ‌కుండా ఇష్ట‌మున్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సీపీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement