Friday, November 22, 2024

సోనియాతో మ‌ళ్లీ భేటీ అయిన వ్యూహ‌క‌ర్త‌ ప్ర‌శాంత్ కిశోర్‌.. ఏం చర్చించారంటే

రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియా గాంధీతో ఇవ్వాల మ‌రోసారి భేటీ అయ్యారు. కొన్ని రోజుల క్రింద‌టే ఆయ‌న సోనియాను క‌లిసి రోడ్‌మ్యాప్ అంద‌జేశారు. మ‌ళ్లీ భేటీ కావ‌డం ప్రాధాన్యాన్ని సంత‌రించుకుంది. ఈ సారి దిగ్విజ‌య్‌, క‌మ‌ల్‌నాథ్‌, ముకుల్ వాస్నిక్‌, జైరాం ర‌మేశ్‌, కేసీ వేణుగోపాల్‌, ఆంటోనీ కూడా ఆయ‌న‌తో పాటు పాల్గొన్నారు. 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు గుజ‌రాత్‌, హిమ‌చల్ ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల గురించి కూడా చ‌ర్చిస్తున్న‌ట్లు స‌మాచారం.

అయితే యూపీ, బిహార్‌, ఒడిశా లాంటి ప్రాంతాల్లో ఇక‌పై కాంగ్రెస్ ఒంట‌రిగానే బ‌రిలోకి దిగాల‌ని వ్యూహ‌క‌ర్త‌ పీకే సూచించిన‌ట్లు తెలుస్తోంది. ఇక‌.. త‌మిళ‌నాడు, మ‌హారాష్ట్ర‌, బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో మాత్రం పొత్తు అనివార్య‌మ‌న్న టిప్స్ కాంగ్రెస్‌కు ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ స‌ల‌హాను రాహుల్ కూడా అంగీక‌రించిన‌ట్లు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement