Friday, November 22, 2024

Viral Video: పారాగ్లైడింగ్​లో వింత అనుభవం.. ఇక నేలను ఢీకొనే టైమ్​లో ఏమయ్యిందంటే.. (వీడియో)

పారా గ్లైడింగ్ అనేది ఓ సాహస క్రీడ. మనిషి పక్షిలా గాలిలో తేలియాడుతూ ఎగరాలనుకుంటే దీన్ని ప్రయత్నించవచ్చు. సాధారణంగా బీచులు, ఎత్తైన కొండ ప్రాంతాల్లో పారా గ్లైడింగ్‌లు కనిపిస్తుంటాయి. ఇండియాలో అయితే.. హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ రాష్ట్రాల్లో పారా గ్లైడింగ్​ ఎక్కువగా ఉంటుంది. దానిపై విదేశాల్లో చాలా ప్రాంతాల్లో ఈ పారా గ్లైడింగ్​ చేస్తుంటారు. అయితే.. ఓ పారా గ్లైడర్​ ఆకాశం నుంచి ఎగురుతూ అత్యంత వేగంగా భూమివైపుగా దూసుకొస్తున్న వీడియో ఒకటి ఇవ్వాల వైరల్​గా మారింది.

ఈ వీడియోలో ఉన్న పారా గ్లైడర్​ గాలిలో తేలియాడుతూ కిందికి వస్తుంటాడు. కొద్ది సేపటికి తన పారాచూట్​ ఓపెన్​ కాకపోవడం, అది తాడులా తనను పెనవేసుకుపోవడంతో ఏం చేయాలో తెలియక వేగంగా భూమివైపు దూసుకొస్తుంటాడు. ఇది చూస్తున్న చాలామంది ఇక అతని పని అయిపోయింది. ‘‘ఇవ్వాల ఎవరి ముకం చూశాడో, పాఫం’’ అని అనుకుంటూ ఉంటారు.

అయితే.. అందరూ అనుకున్నట్టు అతనికి ఇంకా భూమ్మీద నూకలు చెల్లిపోలేదు. అతనికి ఇంకా ఆయుష్యు ఉందనే అనుకుంటా. ఎందుకంటే.. తను మరికొన్ని సెకన్లలో నేలను తాకుతాడు అనుకునే లోపే.. అతని దగ్గరున్న మరో పారాచూట్​ ఓపెన్​ అవుతుంది. దాని సాయంతో ఫోర్సుగానే భూమిపై ల్యాండ్​ అవుతాడు. ఇది చూసిన వారంతా హమ్మయ్య బతికిపోయాడు అనుకుంటారు. కానీ, ఇదంతా కావాలనే చేశారు అని, లేకుంటే ఆ వీడియోని అంత దగ్గరగా ఎలా తీయగలుగుతారు అని కొంతమంది కామెంట్స్​ చేస్తుండగా.. ఇది తన దగ్గరున్న లైవ్​ కెమెరాలో రికార్డయ్యిందని మరికొందరు అంటున్నారు. ఏదైమైనా ఇట్లాంటి రిస్క్​లు అవసరమా అని ఇంకొంతమంది సీరియస్​గా హెచ్చరిస్తున్నారు.

అయితే ఈ పారా గ్లైడర్​ పేరు కెవిన్​ పిలిప్ (Kevin Philipp) అని, ఇతనో స్పోర్ట్స్​ పర్సన్​గా తెలుస్తోంది. ఇతను ఇప్పటికే ఇట్లాంటి డేంజరస్​ పారాగ్లైడింగ్​ (స్కై డైవింగ్​) చేసి ఎన్నో అవార్డులు కూడా గెలుచుకున్నట్టు సమాచారం. ఈ స్టంట్​ జరిగింది స్పెయిన్​లోని ఒరాగ్నా ప్రాంతంలో అని తెలుస్తోంది.

ఈ వీడియో చూసి, దీనిపై మీరేం అనుకుంటున్నారో కామెంట్​ రూపంలో ఇవ్వండి.. మీ ఫ్రెండ్స్​, రిలేటివ్స్​కి షేర్​ చేయండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement