ఓ వింత ఆకారం ఆస్ట్రేలియా సిడ్నీలో బయటపడింది. ఓ వ్యక్తి జాగింగ్ చేస్తుండగా రోడ్డుపై ఈ వింత జీవిని గుర్తించాడు హ్యారీ హేస్. కాగా ఆ జీవి ముందు భాగం ఏనుగు తొండం ఆకారంలో ఉంది. కట్టెపుల్లతో దాన్ని కదిలించినా అది కదలలేదు. వెంటనే హేస్ దాన్ని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశాడు. దీన్ని చూసినవారంతా ఈ జీవి ఏంటి.. ఏలియనా అని తెలుసుకోవడానికి నానా ప్రయత్నాలు చేశారు. ప్రముఖ ఆస్ట్రేలియన్ ఇన్‌ఫ్లుయెన్సర్ లిల్ అహెన్‌కాన్ ఈ పోస్టును తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. “ఇది ఏమిటి?” అని క్యాప్షన్ పెట్టింది. దీంతో ఈ పోస్టు వైరల్ కావడం ప్రారంభమైంది. ఇంతకీ ఆ వింత జీవి ఏమిటనేది ఇప్పుడు ఎవరికీ అంతుచిక్కట్లేదు. అది షార్క్ పిండం కావచ్చు.. లేదా ఇతర సముద్ర జీవి, అయి ఉండోచ్చని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరూ నెటిజన్లు ఏకంగా అది గ్రహాంతరవాసి(ఏలియన్) కావొచ్చునని కామెంట్స్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో ట్విట్టర్ వంటి ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు వ్యాపించింది. ఇప్పుడూ ఈ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement