ప్రపంచంలోనే అత్యంత వృద్ధ ఎయిర్ హోస్ట్ గా పేరుగావించారు బెట్టే..ఆమె తన యంగ్ ఏజ్ లో ఎయిర్ హోస్ట్ గా జాయిన్ అయ్యారట. కాగా 86 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టినా ఇంకా అదే ఉద్యోగం లో కొనసాగుతూ.. ప్రపంచ రికార్డు సృష్టించారు. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ ఎయిర్ హోస్ట్ గా పేరుపొందారు. బెట్టే పేరు ఇటీవలే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చేర్చారు. ఆమెకు అమెరికన్ ఎయిర్లైన్స్తో విడదీయరాని అనుబంధం ఉంది. ఆమె తన జీవితంలో 65 ఏళ్లు ఎయిర్ హోస్ట్ గా పనిచేశారు. బెట్టే మసాచుసెట్స్కు చెందిన మహిళ. 1957లో ఎయిర్ హోస్టెస్గా కెరీర్ను ప్రారంభించారు.
బెట్టేకి ఎయిర్లైన్స్.. నచ్చిన విమాన మార్గాన్ని ఎంచుకునే స్వేచ్ఛను కల్పించింది. ఆమె ఎప్పుడూ న్యూయార్క్-బోస్టన్-వాషింగ్టన్ డీసీ మార్గాన్ని ఎంచుకుంటారు. ఇలా ఈ మార్గాన్ని ఎంచుకోవడం వెనుక ఓ బలమైన కారణం ఉంది. అదే ఆమె కుమారుడు. ఈ దారిలో వెళ్తున్నప్పుడు ఆమె తన కుమారుడు ఇంటికి వెళ్లగలుగుతుంది. బెట్టే కుమారుడు వికలాంగుడు. అతనిని ఒక సంరక్షకుడు చూసుకుంటాడు. ఎయిర్ లైన్స్ లో చేరే కొత్త ఫ్లైట్ అటెండెంట్లకు బెట్టే పలు సూచనలు చేశారు. ఈ ఉద్యోగంలో మానవత్వానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. తాను ఆరోగ్యంగా ఉన్నంత కాలం పని చేస్తానని బెట్టే తెలపడం విశేషం.