దిల్ రాజు టాలీవుడ్ లో ఈ పేరు తెలియని వారు ఉండరు..డిస్ట్రిబ్యూటర్ నుండి పాన్ ఇండియా నిర్మాతగా ఎదిగారు దిల్ రాజు. రీసెంట్ గా మరోసారి తండ్రి అయ్యారు ఆయన..కాగా తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో ఓ చిత్రం చేస్తున్నారు. అంతేకాదు త్వరలో ఓ భారీ సినీ స్టూడియో ని నిర్మించటానికి సన్నాహాలు మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. హైదరాబాద్ ఇప్పటికే వరస సినిమా షూటింగ్ లతో ఫిల్మ్ హబ్ గా మారింది. ముఖ్యంగా రామోజీ ఫిల్మ్ కసిటీ…అతి పెద్ద సిని స్టూడియోగా అవతరించింది. తెలుగుతో పాటు హిందీ,తమిళ, మళయాళ చిత్రాలు, అప్పుడప్పుడు హాలీవుడ్ చిత్రాలు సైతం ఇక్కడ షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఎక్కడెక్కడి స్టార్స్ హైదరాబాద్ కు షూటింగ్ కోసం వస్తున్నారు.
మరో ప్రక్క వెబ్ సీరిస్ లు షూటింగ్ లు జరుగుతున్నాయి. వీటితో పాటు టీవి సీరియల్స్. ఎక్కడ చూసినా షూటింగ్ లతో ప్రతీ స్టూడియో ఫుల్ బిజీగా ఉంటోంది. ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం ఓ చిన్న స్టూడియోని హైదరాబాద్ లో లాంచ్ చేసారు. మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఓ పెద్ద స్టూడియో ప్లానింగ్ లో ఉన్నారు. ఈ ట్రెండ్ ని అనుసరిస్తూ దిల్ రాజు సైతం స్టూడియో నిర్మాణం చేయబోతున్నట్లు సమాచారం. ఆయన కుమార్తె హన్సిత రెడ్డి ఆలోచన ఇదని తెలుస్తోంది. హైదరాబాద్ లోని అతి పెద్ద స్టూడియోస్ లో ఒకటిగా తమది నిలవాలని ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. శంషాబాద్ కు దగ్గరలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు దగ్గరలో దిల్ రాజుకు సొంత స్దలం ఉందని, అది ప్రైమ్ ల్యాండ్ అని అక్కడ స్టూడియోని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్లు మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చే అవకాసం ఉంది.