ఆస్కార్ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది.ఈ సారి ఆస్కార్ లో తెలుగు చిత్రం ఆర్ ఆర్ ఆర్ కూడా ఉండటంతో ఉత్కంఠంగా మారింది.ఇప్పటికే అంతర్జాతీయ వేదికపై గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ ఛాయిస్, హాలీవుడ్ ఫిలిం క్రిటిక్ ఛాయిస్ అవార్డ్స్ అందుకుని సత్తా చాటిన ట్రిపుల్ ఆర్.. ఇప్పుడు సినీరంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ కోసం పోటి పడుతుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ నామినేట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి ఆస్కార్ అందుకోవాలని తెలుగు ప్రేక్షకులకు కోరుకుంటున్నారు. ఎలాగైనా ఆస్కార్ మాకు రావాలంటూ దేవుడికి మొక్కుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు సినీ ప్రియులు. ఇక ఈసారి ఆస్కార్ అవార్డ్స్ ప్రధానోత్సవ వేడుకలలో చాలా ప్రత్యేకతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అతిథులకు స్వాగతం పలికే రెడ్ కార్పెట్ ఇప్పుడు రంగు మార్చుకుంది. పేరుకు మాత్రమే రెడ్ కార్పెట్ కానీ ఈసారి కనిపించేది మాత్రం షాంపైన్ అట. ఈసారి ఆస్కార్ లో ప్రత్యేకతలు చాలానే వున్నాయి..
ఈ ఆస్కార్ లో జిమ్మీ కిమ్మెల్ మూడవసారి హోస్ట్ గా చేస్తున్నాడు. కానీ అతను స్టేజి మీదకి రాకముందే వాలెట్ హబ్ దగ్గర బిగ్ డ్యాన్స్ ఏర్పాటు చేసారు నిర్వాహకులు. ఇక ఆస్కార్ ఖర్చు మొత్తం 56. 6 మిలియన్ డాలర్స్ అవుతుందట. ఈ ఖర్చులో ముఖ్యంగా A list నటి రెడ్ కార్పెట్ దగ్గర వేసుకునే డ్రెస్ ఖర్చు 10 మిలియన్ డాలర్స్ వుంటుందట. ఇప్పటివరకు రెడ్ కార్పెట్లో అత్యంత ఖరీదైన లుక్ లో కనిపించింది లేడీ గాగా , ఆమె 2019 లో ఆమె మెడలో ధరించిన పసుపు రంగు 128 క్యారెట్ డైమండ్ ఖరీదు 30 మిల్లియన్ డాలర్స్ ఇదే ఇప్పటివరకు రికార్డు. ఈసారి రెడ్ కార్పెట్ పేరుకు మాత్రమే కార్పెట్ రంగు మాత్రం రెడ్ కాదు షాంపైన్ కలర్ గా మార్చేశారు. 961 తర్వాత మొదటిసారి కార్పెట్ కలర్ ని ఈసారి మారుస్తున్నారు. ఈ కార్పెట్ 50 000 స్క్వేర్ ఫీట్ ఉంటుంది.. దీని ధర 24 వేల 700 డాలర్స్ అంట. ఇది మొత్తం ఇంస్టాల్ చేయడానికి 600 గంటలు సమయం పట్టిందట. ఒకవేళ ఆస్కార్ ఈవెంట్ లో ప్రకటన ఇవ్వాలి అనుకునేవాళ్ళకి 30 సెకన్లకు 2 మిలియన్ డాలర్స్ పే చేయాల్సి ఉంటుందంట.మరి ఆస్కార్ లో మన ఆర్ ఆర్ ఆర్ కి అవార్డు వస్తుందో లేదో తెలియాల్సి ఉంది.