మైత్రీ మూవీస్ పేరుకాదు స్టార్ హీరోలకి బ్రాండ్ గా మారింది ఈ సంస్థ. నవీన్ యేర్నేని..వై.రవిశంకర్..చేకూరి మోహన్ లు స్థాపించిన సంస్థ మైత్రి మూవీస్. ఈ సంస్థలో వచ్చిన చిత్రాలన్నీ దాదాపు హిట్ గా నిలిచినవే..ఒకటో..రెండో ఫెల్యూర్స్ తప్ప..పలు విజయాలను తమ ఖాతాలో వేసుకుంది ఈ సంస్థ. కాగా మైత్రీ మూవీస్ లో తెరకెక్కిన మొదటి చిత్రం శ్రీమంతుడు..ఈ చిత్రంలో హీరోగా సూపర్ స్టార్ మహేశ్ బాబు..హీరోయిన్ గా శృతిహాసన్ నటించారు.ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. 40-70 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు ఈ చిత్రానికి. కాగా ఈ మూవీ 7, ఆగస్టు 2015న ప్రపంచవ్యాప్తంగా 2500 థియేటర్స్ లో విడుదలైంది. రెండవ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో మోహన్ లాల్, జూనియర్ ఎన్.టి.ఆర్, సమంత, నిత్య మేనన్ ప్రధాన పాత్రలో నటించిన జనతా గ్యారేజ్. ఈ చిత్రం సెప్టెంబరు 1 2016లో విడుదలైదంది.
మూడవ చిత్రంగా సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ , సమంత, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటించిన రంగస్థలం. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 30, 2018 న విడుదలైంది.ఈ మూడు చిత్రాలు సూపర్ డూపర్ హిట్ట్ కాగా ఆ తరువాత ఈ సంస్థలో సవ్యసాచి,అమర్ అక్బర్ ఆంటోని,ఉప్పెన,పుష్ప: ది రైజ్,సర్కారువారి పాట,అంటే సుందరానికి,హ్యాపీ బర్త్ డే,ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి తెరకెక్కాయి. ఇక ఈ ఏడాది సంక్రాంతికి వీర సింహ రెడ్డి, వాల్తేరు వీరయ్య ,అమిగోస్ రిలీజ్ అయి హిట్ గా నిలిచాయి. దాంతో హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది మైత్రీ మూవీ సంస్థ. దాంతో ఈ సంస్థ పేరు మారుమ్రోగుతోంది. ఈ నిర్మాణ సంస్థను ఆరంభించిన దగ్గర నుంచి వరుస సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. సాధారణంగా ఏ నిర్మాణ సంస్థ అయినా ఒక ప్రాజెక్టు తరువాత మరో ప్రాజెక్టును సెట్ చేసుకుంటూ వెళుతుంటుంది.
కానీ మైత్రీ మాత్రం ఒకేసారి మూడు నాలుగు ప్రాజెక్టులను పట్టాలెక్కించేస్తూ వెళుతోంది. చాలా తక్కువ గ్యాప్ లో హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకోవడం కూడా మైత్రీకి దక్కిన అరుదైన రికార్డు అనే చెప్పాలి.ఈ సంస్థలో హీరో విజయ్ దేవరకొండ..సమంత నటిస్తోన్న ఖుషి చిత్రం తెరకెక్కుతోంది. నడికర్ తిలకం అనే చిత్రం మలయాళంలో రూపొందుతోంది.వీటితో పాటు పుష్ప 2: ది రూల్..ఉస్తాద్ భగత్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్..హీరోగా పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు.ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ 31 ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు.SGRE తెలుగు చిత్రం రూపొందనుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిచనున్న RC16ఈ నిర్మాణ సంస్థలో భారీగా తెరకెక్కనున్నాయి. ఇప్పటి వరకు మైత్రీ సంస్థ తెరకెక్కించిన చిత్రాల్లో ఎక్కువశాతం స్టార్ హీరోలతో తెరకెక్కించినవే కావడం గమనార్హం.మరి మున్ముందు ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేయనుందో ఈ సంస్థ.