ఒకప్పటి పరిస్థితులు ఎలా ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో హీరోయిన్స్ కి తల్లి అయిన ఆఫర్స్ వస్తున్నాయి. దానికి కారణం కూడా ఉంది. నేటి హీరోయిన్స్ పెళ్లయి..తల్లయినా కూడా తమ శరీరాన్ని నాజూకుగా..ఫిట్ గా ఉంచేందుకు వారు పడే శ్రమ అంతా ఇంతా కాదు. దాంతో వారు నడి వయసుకు వచ్చినా.. యంగ్ గా కనిపిస్తుండటంతో వారికి మూవీ ఛాన్స్ లు వస్తున్నాయి.. యంగ్ గా కనిపించేందుకు చక్కని పోషకాహారం, మితాహారం తీసుకోవాలి. రోజూ శారీరకంగా శ్రమించాలి. సరిపడా మంచి నిద్ర పోవాలి. ఇవన్నీ చేసినప్పుడు పెరుగుతున్న వయసు ఛాయలు అంతగా బయట పడవు. నటీ నటులు తమ అందం కోసం ఎంతో ఖర్చు చేస్తుంటారు. ఎంతో శ్రమిస్తుంటారు. అందం ఉన్నంత వరకూ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అందుకే వారు ఎంతో శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. బాలీవుడ్ నటి కరీనా కపూర్ పెళ్లయి ఇద్దరు పిల్లల తల్లి కూడా. 42 ఏళ్ల వయసులో ఆమె ఇప్పటికీ శారీరకంగా రోజూ శ్రమిస్తూ, ఫిట్ నెస్ కాపాడుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియోని ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. ఈ వీడియో చూస్తే నడి వయసులో ఆమె తన అందాన్ని ఎలా కాపాడుకుంటోందో గమనించొచ్చు. మరోవైపు శిల్పాశెట్టి కూడా ఫిట్ నెస్ ప్రియురాలే. తన వీడియోలతో అభిమానుల్లోనూ ప్రేరణనిస్తుంటుంది. తాను చేసే వర్కవుట్ వీడియోలను ఎప్పటికప్పుడు విడుదల చేస్తుంటుంది. తాజాగా గుండెకు సంబంధించిన వ్యాయామం చేస్తూ వీడియోని ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. రీసెంట్ గా తల్లులయిన కాజల్.. ప్రణీతలు కూడా తమ ఫిట్ నెస్ ని కాపాడుకుంటూ యంగ్ లుక్ లో మెరిసిపోతున్నారు.
ఇలా నేటితరం హీరోయిన్స్ తమ శరీరాన్ని ఫిట్ గా ఉంచేందుకు కఠినతర వర్క్ వుట్స్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు.నటి జ్యోతిక కూడా పెళ్ళి..పిల్లలు తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతున్నారు. అంతేకాదు నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్ కూడా రీసెంట్ గా తల్లిగా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే.
సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం.. అందాన్ని కాపాడుకుంటేనే ఆఫర్లు వస్తాయి. అదే మంత్రాన్ని పాటిస్తున్నారు సీనియర్ హీరోయిన్స్ దగ్గర నుండి నేటి హీరోయిన్స్ వరకు ఫిట్ నెస్ ఫ్రీక్ గా మారుతున్నారు. హీరోలకి తామేం తీసిపోమని జిమ్ ల బాట పడుతున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ ..ప్రగతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది.. ఆమె తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా తన తాజా క్షణాలు, వర్కౌట్ మూమెంట్లను తన అనుచరులతో పంచుకుంటోంది. ఆమె చేస్తోన్న అతి కఠినమైన వర్క్ వుట్స్ వీడియోలని ఆ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆమె ఫిట్నెస్ను కాపాడుకోవడంలో ఆమె అంకితభావాన్ని నెటిజన్లు .. ఆమె అనుచరులు ప్రశంసిస్తున్నారు. ప్రగతి ఫిట్నెస్ ఫ్రీక్ అని, జిమ్లో వర్కవుట్లు చేస్తూ ఎక్కువ సమయం కేటాయిస్తున్న సంగతి తెలిసిందే.ఇక వర్క్ వుట్స్ ఎక్కువగా చేసే వారిలో సమంత..రకుల్ ప్రీత్ సింగ్..తో పాటు చాలా మంది ఉన్నారు. బొద్దుగా ఉండే అంజలి..మెహరిన్ ఫిర్జాది..కీర్తిసురేష్ లాంటి భామలంతా నాజూకుగా మారి ప్రేక్షకులని అలరిస్తున్నారు.