Saturday, November 23, 2024

Story : తేళ్ల విషంతో మెడిసిన్ – ఒక గ్రాము రూ.80వేలు

మ‌నుషుల‌కి ఉప‌యోగ‌ప‌డే మెడిస‌న్స్ లో విషాన్ని క‌లుపుతార‌ని మీకు తెలుసా..విషానికి ప‌లు ర‌కాల వ్యాధుల‌ను న‌యం చేసే శ‌క్తి ఉందంటే విన‌డానికి ఆశ్చ‌ర్యంగా ఉన్నా ఇది నిజం.విషాల్లో కూడా ఎన్నో ర‌కాలు ఉంటాయి. తేళ్లు గురించి అంద‌రికీ తెలిసిందే. వీటి విషం మ‌హా ఖ‌రీదైన‌ద‌ట‌. ఈ తేలు విషం ఒక గ్రాము రూ. 80వేల రూపాయ‌లు ప‌లుకుతుంద‌ట‌. అంటే లీటర్ తేలు విషం ధర రూ. 80కోట్లు వరకు పలుకుతుంది. దీంతో ప్రపంచంలో అత్యంత ఖరీదైన విషంగా తేలు విషయం ఉంది. టర్కీ దేశంలో తేళ్లను ల్యాబ్స్‌లో పెట్టి మరీ పెంచుతున్నారట..టర్కీలోని ఒక ల్యాబ్‌లో రోజుకు తేళ్ల నుంచి 2 గ్రాముల విషాన్ని సేకరిస్తున్నారు. తేళ్లను బాక్సుల నుండి బయటకు తీసి ప్రత్యేక పద్ధతుల్లో వాటి నుంచి విషాన్ని తీస్తారు. తర్వాత విషాన్ని గడ్డకట్టించి పొడి చేసి విక్రయిస్తారు.

ఈ తేలు విషాన్ని యాంటీబయాటిక్స్, కాస్మోటిక్స్, పెయిన్ కిల్లర్స్ తయారీలో కూడా వాడతారట. ఒక తేలులో 2 మిల్లీగ్రాముల విషం ఉంటుంది. ఒక గ్రాము విషం కావాలంటే.. 300-400 తేళ్లు అవసరం అవుతాయి. తేలు విషంలో కాంపొనెంట్స్ ఉంటాయి. దీంతో కీళ్లవాతాన్ని సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించవచ్చని అమెరికాలోని బేలార్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన పరిశోధనల్లో తేలింది. మొత్తానికి తేళ్ల విషంలో మంచి చేసే మెడిస‌న్ ఉందట‌. అలా అని తేలుతో కుట్టించుకున్నామా ప్రాణాలు గాల్లో క‌లిసిపోవ‌డం ఖాయం.

Advertisement

తాజా వార్తలు

Advertisement