Wednesday, November 20, 2024

Story : నేడు దివంగ‌త న‌టి.. సీఎం జ‌య‌ల‌లిత 75వ జ‌యంతి

నేడు త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి.. దివంగ‌త న‌టి జ‌య‌ల‌లిత 75వ జ‌యంతి. జయలలిత ఫిబ్రవరి 24, 1948న జన్మించారు. ఆమె 1991 నుండి 1996 వరకు, 2001, 2002 నుండి 2006, మరియు 2011 నుండి 2014 వరకు నాలుగు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాగా జయలలిత అమ్మగా ప్రసిద్ధి చెందారు..అంతేకాకుండా ప్రజానాయకురాలిగా ప్ర‌సిద్ధి చెందారు.. కాగా డిసెంబర్ 5, 2016న ఆమె మరణం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. జయలలిత 14 ఏళ్ల పాటు ఆరుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు.కాగా ఆమె ముఖ్యమంత్రిగా తన మొదటి జీతం చెక్‌ను తిరస్కరించారు.
పబ్లిక్ సర్వెంట్‌గా ఆమె జీతం పొందాలని చెప్పడంతో, ఆమె తన నెలవారీ జీతం రూ.1/- తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

జయలలిత తన నటనా జీవితంలో 85 కంటే ఎక్కువ తమిళ సినిమాలు ..ఒక హిందీ చిత్రం చేశారు. ఆమె ‘ఇజ్జత్’లో ధర్మేంద్ర సరసన నటించింది, ఆ చిత్రం హిట్ అయింది. 1995లో, ఆమె ముఖ్యమంత్రిగా మొదటి సారిగా, ఆమె తన పెంపుడు కొడుకు సుధాగరన్‌కి ఘనంగా వివాహాన్ని నిర్వహించారు. గిన్నిస్ రికార్డు ప్రకారం, చెన్నైలోని 50 ఎకరాల మైదానంలో జరిగిన ఈ వివాహానికి 1,50,000 మంది అతిథులను ఆహ్వానించారు.జయలలిత రెండేళ్ల వయసులో ఆమె తండ్రి మరణించారు. ఆమె తల్లి బెంగుళూరుకు వెళ్లి అక్కడ తమిళ సినిమాలో నటిగా జీవితాన్ని ప్రారంభించింది..జయలలిత 15 ఏళ్ల వయసులో సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు..1982లో ఆమె రామచంద్రన్ స్థాపించిన ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK)లో చేరారు. 1972లో తమిళనాడు ప్రభుత్వం ఆమెకు కలైమామణి పురస్కారాన్ని అందజేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement