Friday, November 22, 2024

Story : కౌగిలింత‌తో రిలాక్స్-గంట‌కి రూ.7వేలు

హ‌గ్ అదేనండి కౌగిలింత‌..దీనికి ఎంతో ప్రాముఖ్యం ఉంద‌ని మీకు తెలుసా..హ్యపీగా ఉన్న‌ప్పుడైనా..బాధ‌లో ఉన్న‌ప్పుడ‌యినా మ‌న‌కి న‌చ్చిన‌వారిని హ‌గ్ చేసుకుంటే ఆ బాధ కాస్త త‌గ్గుతుంద‌ట‌. ప‌లు రోగాల‌కి రిలీఫ్ ఈ కౌగిలింత‌. అయితే ఈ హ‌గ్ కి ఓ రేటు ఉంద‌ని మీకు తెలుసా.. కౌగిలింతలతో లక్షల రూపాయలు సంపాదిస్తే ఎలా ఉంటుంది. వినడానికి కాస్త వింతగా అనిపించినా ప్రొఫెషనల్ డాక్టర్లు, ఇంజనీర్లు కాకుండా ప్రొఫెషనల్ కడ్లర్లు కూడా ఉన్నారు.తమ మనసులోని భావాల్ని ఇతరులతో పంచుకోలేక ఒంటరితనం అనుభవిస్తున్న వారికి భరోసా కల్పించేలా బ్రిటన్ బ్రిస్టల్‌కు చెందిన హూటన్ ప్రయత్నిస్తున్నాడు.

ఎవరైనా బాధతో, ఆవేదనతో ఉన్నా.. ఒంటరి తనంతో దిగులుగా ఉన్నా వారిని కౌగిలించుకుంటాడు. బాధితులు చెప్పింది.. ఓర్పుగా వింటాడు.. వారి ఆందోళన తగ్గే విధంగా చేస్తాడు.. అయితే అతను ఇలా కడల్ థెరపీ ఇవ్వడానికి ఛార్జ్ వసూలు చేస్తాడు. గంటకు 75 పౌండ్లు అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ.7వేలను వసూలు చేస్తాడన్నమాట. UKలోని బ్రిస్టల్ నగరంలో నివసించే ట్రెవర్ హూటన్ మొదట ఒంటరితనంతో మానసికంగా క్షోభ పడేవారికి స్వాంతన చేకూర్చాలనే ఉద్దేశంతోనే ట్రెజర్ దీనిని మొదలుపెట్టాడు. కాలక్రమంలో దీనినే వృత్తిగా స్వీకరించాడు. కడిల్ థెరపీ’ ఇవ్వడం అంత సులభం కాదు.హూటన్ కొన్ని నెలల క్రితం ఈ వ్యాపారాన్నిమొదలు పెట్టాడు. ఈ సంస్థ ఒక్క కౌగిలింతలతో ఓదార్పుని వ్వడమే కాదు.. ‘కనెక్షన్ కోచింగ్’ వంటి సేవలను కూడా అందిస్తుంది. ఇది ఇతరులతో బంధాన్ని అనుబంధాన్ని పెంపొందించుకునే విధంగా వ్యక్తులకు సహాయపడుతుంది.

సమస్యల్లో ఉన్న వ్యక్తులకు భావోద్వేగ మద్దతు ఇస్తుంది. సమస్యలతో ఉన్నవారిని కౌగిలించుకుని ఓదార్పునిస్తుంది.ఇదే విషయంపై హూటన్ స్పందిస్తూ.. తన పని ప్రజలు అనుకున్నంత సులభం కాదని అన్నారు. దీని కోసం .. ఎదుటివారి మనసుని అర్ధం చేస్తూనే సామర్థ్యాన్ని కలిగి ఉండాలన్నారు. నేను ఎవరినైనా కౌగిలించుకున్నప్పుడు.. వారి దుఃఖాన్ని పంచుకుంటూ.. ఓదార్పునివ్వాలని బాధితులు భావిస్తారని.. అందుకు అనుగుణంగా తాను స్పందించాల్సి ఉంటుందని తెలిపారు. అయితే తాను చేస్తోన్న పనిని కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారని.. కానీ తాను ఎటువంటి కామెంట్స్ ను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నానని చెప్పాడు. సంపాద‌న‌కి సంపాదన వ‌స్తుంది..మ‌న‌సుకి సంతృప్తిని ఇస్తుందట ఆయ‌న చేస్తోన్న‌ప‌ని. అంతేలే ఎవ‌రి వృత్తి వారికి గౌర‌వ‌ప్ర‌ద‌మ‌యిన‌దేగా.

Advertisement

తాజా వార్తలు

Advertisement