Tuesday, November 26, 2024

మ‌హిళ‌ల‌ను డ్రెస్సు కొల‌త‌ల ఆధారంగా జ‌డ్జ్ చేయ‌డం ఆపండి – స‌మంత‌

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత డ్రెస్సింగ్ పై ప‌లువురు నెటిజ‌న్లు అభ్యంత‌రక‌ర వ్యాఖ్య‌లు చేశారు. దాంతో వారికి స‌మంత ఇన్ స్టాగ్రామ్ లో కౌంట‌ర్ ఇచ్చింది. దుటి మహిళలపై కామెంట్లు చేయడానికి బదులు తమ మెరుగుదల గురించి ఆలోచిస్తే బాగుంటుందని చురకలంటించింది. ఓ మహిళగా మహిళపై వచ్చే విమర్శల గురించి స్వతహాగా నాకు బాగా తెలుసు. మహిళలు ఎలాంటి వస్త్రాలు ధరిస్తున్నారు, వారి జాతి, విద్య, సామాజిక హోదా, లుక్స్, చర్మం రంగు వంటి వాటిని ఆధారంగా చేసుకుని మహిళలను విమర్శిస్తున్నారు. చెబుతూ పోతే ఆ లిస్టు ఇంకా ఎక్కువే ఉంటుంది. అయితే, వేసుకున్న దుస్తుల ఆధారంగా మహిళను జడ్జ్ చేయడం ఇటీవలి కాలంలో చాలా ఎక్కువైపోతోంద‌ని తెలిపింది. మనం ఇప్పుడు 2022లోకి వచ్చాం. ఇప్పటికైనా మహిళలను డ్రెస్సు కొలతల ఆధారంగా జడ్జ్ చేయడం మానేస్తే బాగుంటుంది. ఎదుటి వాళ్ల గురించి ఆలోచించడం మానేసి.. వారి గురించి వారు ఆలోచించుకుంటే బాగుంటుంది. ఎవరికివారు తమ తమ అభివృద్ధిపై పోకస్ పెడితే జీవితంలో ఎదుగుతారు. మన ఆలోచనలను ఎదుటివారిపై రుద్దడం వల్ల ఎవరికీ లాభం ఉండదు. ఓ వ్యక్తిని అర్థం చేసుకోవడంలో.. వారి మనసులు తెలుసుకోవడంలో మార్పు తీసుకొద్దాం’’ అని సమంత కౌంటర్ ఇచ్చింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement