Saturday, November 23, 2024

Breaking: సీఎం ఇంటిపై దుండగుల రాళ్ల దాడి

హరియాణా ముఖ్యమంత్రి మనోహర్​ లాల్​ ఖట్టర్​ నివాసంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్ప‌డ్డారు. బైక్ ల‌పై వ‌చ్చిన గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు రాళ్లు రువ్వారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. బైక్​లపై వచ్చి..కర్నాల్​లోని ముఖ్యమంత్రి నివాసం వద్ద దుండగుల దాడిని మొదట అక్కడే ఉన్న ఇద్దరు సెక్యూరిటీ గార్డులు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ద్విచక్రవాహనాలపై సుమారు ఐదు-ఆరుగురు వచ్చారని పేర్కొన్నారు. భద్రతా సిబ్బంది తమను గుర్తించడం వల్ల నిందితులు అక్కడి నుంచి పరారయ్యారని తెలిపారు. దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించారు. దుండగులు రువ్విన రాళ్లదాడి నేపథ్యంలో సీఎం ఇంటి దగ్గర పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement