బీహార్ ముఖ్యమంత్రి కాన్వాయ్‌పై రాళ్లదాడి చేయడంతో కాన్వాయ్‌లోని నాలుగు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే ఆ కార్లలో సీఎం నితీశ్ కుమార్ లేరు. అసలు విశయం ఏంటంటే.. సీఎం నితీశ్ కుమార్ ఈరోజు గయాలో పర్యటించాల్సి ఉంది. ఆయన గయా పట్టణానికి హెలీకాప్టర్‌లో చేరుకోనున్నారు.
ఈనేపథ్యంలో సీఎం స్థానికకంగా తిరడంకోసం ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని కార్లు ఆదివారం సాయంత్రం గయాకు బయల్దేరాయి. అయితే పట్నా-గయా హైవేపై రాజధాని శివార్లలో అప్పటికే కొందరు తమ సమస్యను పరిష్కరించాలని ధర్నా చేస్తున్నారు. ఈక్రమంలో సీఎం కాన్వాయ్ అటుగా రావడంతో కోపోద్రిక్తులైన యువకులు కార్లపై రాళ్లు విసిరారు. దీంతో కాన్వాయ్‌లోని నాలుగు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు 13 మంది నిందితులను అరెస్టు చేశారు. రాళ్లదాడి ఘటనలో 13 మంది నిందితలను అరెస్టు చేసినట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెలిపారు.