కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు. ఇంటి ముందు పార్క్ చేసిన కారుని కూడా ధ్వంసం చేశారు దుండగులు. ఈ సంఘటన హైదరాబాద్ అంబర్ పేటలో చోటు చేసుకుంది. కాగా తన ఇంటిపై జరిగిన రాళ్లదాడిపై వీహెచ్ స్పందించారు. దాడికి పాల్పడినవారిని గుర్తించాల్సింది పోలీసులేనని అన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా, ఎంపీగా పనిచేసిన తనకే రక్షణ లేకుండా పోయిందని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని, డీజీపీకి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదన్నారు. తన కారును ధ్వంసం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఇంటిపై రాళ్ల దాడి – దర్యాప్తు చేపట్టిన పోలీసులు
Advertisement
తాజా వార్తలు
Advertisement