Friday, November 22, 2024

పొట్టలో రూ. 9 కోట్లు విలువ చేసే హెరాయిన్ – సీజ్ చేసిన పోలీసులు

పొట్టలో హెరాయిన్ నింపి డ్రగ్స్ రవాణాకి పాల్పడ్డారు స్మగ్లర్స్ ..రవాణా చేస్తున్న టాంజానియాకు చెందిన ప్రయాణికుడిని అధికారులు అరెస్ట్ చేశారు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగానికి చెందిన ఎయిర్ ఇంటెలిజెన్స్ అధికారులు సోదాలు చేపట్టారు. ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ విమానం ET335/692లో ఉగాండాలోని ఎంటెబ్బే నుంచి జూలై 14న నగరానికి వచ్చిన టాంజానియా జాతీయుడిని అధికారులు అడ్డుకున్నారు.అతని పొట్టలో క్యాప్సూల్స్‌లో నిక్షిప్తం చేసిన హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం హెరాయిన్ 1.266 కేజీలు ఉందని.. దాని విలువ రూ. 8.86 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఇక, ఈ ఏడాది మేలో కూడా ఇలాంటి కేసు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. రూ. 5.56 కోట్ల విలువ చేసే హెరాయిన్‌ను క్యాప్సూల్స్‌‌లో నింపి పొట్టలో దాచి రవాణా చేస్తున్న వ్యక్తి చెన్నై కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. . దాదాపు రూ. 9 కోట్లు విలువ చేసే 1.26 కేజీల హెరాయిన్‌ను అధికారులు సీజ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement