స్టాక్ మార్కెట్స్ లాభాలతో ప్రారంభమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 30 షేర్ ఇండెక్స్ సెన్సెక్స్ 296 పాయింట్ల లాభంతో 57,115 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 93 పాయింట్లు లాభపడి 17,132 వద్ద ట్రేడింగ్ మొదలైంది. మార్కెట్ ప్రారంభంతో దాదాపు 1525 షేర్లు పైకి కదలగా.. 398 షేర్లు పడిపోయాయి. మరో 78 షేర్లు యథావిధిగా ఉన్నాయి. బుధవారం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ సూచీ 538 పడిపోయి 56,819 పాయింట్లు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 162 పాయింట్లు నష్టపోయి 17,038 వద్ద ముగిశాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement