Wednesday, November 20, 2024

న‌ష్టాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ర‌ష్యా-ఉక్రెయిన్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు త‌గ్గినా, ఇన్వెస్ట‌ర్లు ఉత్సాహంగా ట్రేడింగ్ చేసినా స్టాక్ మార్కెట్లు న‌ష్టాల బాట‌ప‌ట్టాయి. మధ్యాహ్నం లాభాల్లోకి వెళ్లిన మార్కెట్లు చివరకు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 145 పాయింట్లు నష్టపోయి 57,996కి పడిపోయింది. నిఫ్టీ 30 పాయింట్లు కోల్పోయి 17,322 వద్ద స్థిరపడింది. భారతి ఎయిర్ టెల్ (1.41%), హెచ్డీఎఫ్సీ (1.29%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.10%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (1.04%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (0.93%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఎన్టీపీసీ (-1.63%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.58%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.56%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.39%), టాటా స్టీల్ (-1.28%)టాప్ లూజర్స్ గా మిగిలాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement