Tuesday, November 26, 2024

న‌ష్టాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్స్

ఈ వారం స్టాక్ మార్కెట్స్ న‌ష్టాల‌తో ముగిశాయి. అంత‌ర్జాతీయంగా సానుకూల‌త‌లు ఉండ‌టం, ఏసియ‌న్ మార్కెట్ల‌న్నీ రిక‌వ‌రీలో ఉండ‌టంతో నేటి స్టాక్ మార్కెట్స్ లాభాల‌తో ప్రారంభం అయినా చివ‌రికి న‌ష్టాల‌తో ముగిశాయి. అయితే ఇన్వెస్టర్లు చివరిలో లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో చివరకు నష్టాల్లో ముగిశాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 76 పాయింట్లు నష్టపోయి 57,200కి పడిపోయింది. నిఫ్టీ 8 పాయింట్లు కోల్పోయి 17,101 వద్ద స్థిరపడింది. ఎన్టీపీసీ (3.89%), సన్ ఫార్మా (1.85%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.72%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.38%), విప్రో (1.37%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ నిలిచింది. మారుతి సుజుకి (-2.99%), టెక్ మహీంద్రా (-2.43%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-2.14%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.62%), యాక్సిస్ బ్యాంక్ (-1.08%) టాప్ లూజర్స్ గా నిలిచింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement