స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ పరిణామాలతో సెన్సెక్స్ 1747పాయింట్లకి పైగా పతనమైంది. నిఫ్టీ 532పాయింట్లు కోల్పొయింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధ సంక్షోభం, చమురు ధరల మంట, అమెరికా ద్రవ్యోల్బణం.. వెరసి స్టాక్ మార్కెట్ సూచీలను పాతాళానికి నెట్టాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్.. ఏకంగా 1,747 పాయింట్లు నష్టపోయింది. చివరకు 56,405 వద్ద స్థిరపడింది. 30 షేర్ల సూచీలో 29 షేర్లు భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. ఇంతటి ప్రతికూల వాతావరణంలోనూ టీసీఎస్ షేరు రాణించింది. 0.81 శాతం లాభాలతో ట్రేడింగ్ ముగించింది.అటు, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ సైతం కుప్పకూలింది. 532 పాయింట్లు పతనమైంది. చివరకు 16,842 వద్ద ముగిసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..