నేటి స్టాన్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి.. రష్యాపై అమెరికా, ఐరోపా సమాఖ్య విధించిన తాజా ఆంక్షలు, చైనాలోని షాంఘైలో లాక్ డౌన్ విధింపు తదితర కారణాలు మార్కెట్లపై ప్రభావాన్ని చూపాయి. ఈ నేపథ్యంలో ఈరోజు రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 566 పాయింట్లు నష్టపోయి 59,610కి పడిపోయింది. నిఫ్టీ 149 పాయింట్లు కోల్పోయి 17,807 వద్ద స్థిరపడింది. ఎన్టీపీసీ (2.61%), టాటా స్టీల్ (1.94%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.52%), భారతి ఎయిర్ టెల్ (1.17%), నెస్లే ఇండియా (1.10%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ నిలిచాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-3.51%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-3.26%), హెచ్సీఎల్ (-2.07%), టెక్ మహీంద్రా (-1.97%), ఇన్ఫోసిస్ (-1.75%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement