నేటి స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న కొన్ని సానుకూలతలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచాయి. దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,047 పాయింట్లు లాభపడి 57,864కి చేరుకుంది. నిఫ్టీ 312 పాయింట్లు పెరిగి 17,287కి ఎగబాకింది. హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (5.50%), టైటాన్ (4.50%), కొటక్ బ్యాంక్ (3.30%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (3.18%), ఏసియన్ పెయింట్స్ (3.07%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచింది. ఇన్ఫోసిస్ (-1.81%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.23%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement