దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 425 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 100 పాయింట్లు తగ్గింది. ప్రస్తుతం సెన్సెక్స్ 58,821.31 పాయింట్లు, నిఫ్టీ 17,554.70 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నది. ప్రపంచ బలహీన సంకేతాల మధ్య భారతీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఒక రోజు సెలవు తర్వాత ఓపెన్ యూఎస్ మార్కెట్ క్షీణించింది. డౌ జోన్స్ 173 పాయింట్లు క్షీణించగా, నాస్‌డాక్ 86 పాయింట్లు నష్టపోయింది. ఆసియా మార్కెట్లు క్షీణించాయి. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 200 పాయింట్లు తగ్గింది. జపాన్ నిక్కీ 300 పాయింట్లు పతనమైంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement