Tuesday, November 26, 2024

భారీ లాభాల‌తో దూసుకుపోతోన్న స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ట్రెండ్.. స్టాక్ మార్కెట్లపైనా సానుకూల ప్రభావాన్ని కనబరిచింది. భారీ లాభాలతో ట్రేడింగ్ ప్రారంభమైంది. సెన్సెక్స్, నిఫ్టీలు పైకి ఎగబాకుతున్నాయి. ప్రస్తుతం 1,270 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ 55,917 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ కూడా 384 పాయింట్ల లాభంతో 16,729 వద్ద నడుస్తోంది.నిఫ్టీలో బ్యాంక్ సూచీ, ఆర్థిక సేవల సూచీలు, ఆటో ఇండెక్స్ భారీగా లాభపడ్డాయి. వాటి షేర్ విలువ 3 శాతానికిపైగా పెరిగాయి. టాటా మోటార్స్ షేర్ వాల్యూ 7 శాతానికిపైగా పెరిగి.. నిఫ్టీలోనే టాప్ గెయినర్ గా నిలిచింది. ఇటు భారతీ ఎయిర్ టెల్ 2 శాతం పెరిగింది. అవాడా క్లీన్ టీఎన్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ లో 9 శాతం వాటా కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించడంతో మదుపరులు పెట్టుబడులకు మొగ్గు చూపారు. ఇటు ముడి చమురు ధరలు కొంత తగ్గుముఖం పట్టడంతో పెయింట్స్, రసాయనాలు, ఏవియేషన్ స్టాక్స్ విలువ కొంత పుంజుకుంది. ఇటు రూపాయి విలువ బలపడింది. డాలర్ తో రూపాయి మారకం విలువ 42 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్ తో రూపాయి మారకం విలువ 76.20 వద్ద ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement