ఈ రోజు కూడా నష్టాలతో ముగిశాయి స్టాక్ మార్కెట్లు..దాంతో వరుసగా రెండో రోజు నష్టాలబాటలో నడుస్తున్నాయి. కాగా రేపు ఆప్షన్స్ ట్రేడింగ్ ముగియనున్న నేపథ్యంలో ట్రేడింగ్ చివరి సమయంలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 314 పాయింట్లు నష్టపోయి 60,008కి పడిపోయింది. నిఫ్టీ 100 పాయింట్లు కోల్పోయి 17,898 వద్ద స్థిరపడింది.మారుతి సుజుకి (2.77%), ఏసియన్ పెయింట్స్ (2.47%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (2.08%), ఐటీసీ (1.68%), ఎన్టీపీసీ (1.68%) టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఏసియన్ బ్యాంక్ (-1.95%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.91%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-1.51%), భారతి ఎయిర్ టెల్ (-1.39%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-1.19%) టాప్ లూజర్స్ అయ్యాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement