స్వల్ప నష్టాలతో ముగిశాయి స్టాక్ మార్కెట్స్ . మూడురోజులుగా భారీ లాభాలు అందుకున్నాయి. కాగా నేడు తీవ్ర ఒడిదుడుకులకు గురై స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఈ మేరకు ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు మొగ్గు చూపారు. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 20 పాయింట్లు కోల్పోయి 58,786కి పడిపోయింది. నిఫ్టీ 5 పాయింట్లు నష్టపోయి 17,511 వద్ద స్థిరపడింది. ఏసియన్ పెయింట్స్ (3.25%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.25%), ఎం అండ్ ఎం (1.02%), టీసీఎస్ (0.91%), బజాజ్ ఫిన్ సర్వ్ (0.69%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. టైటాన్ (-1.39%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.19%), యాక్సిస్ బ్యాంక్ (-0.92%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-0.86%), టెక్ మహీంద్రా (-0.59%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement