స్వల్ప నష్టాలతో ముగిశాయి నేటి స్టాక్ మార్కెట్లు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ముగుస్తున్న నేపథ్యంలో మార్కెట్లు ఒడిదుడుకులకు గురయ్యాయి. దాంతో నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 12పాయింట్లు కోల్పొయింది. దాంతో 57,794కి పడిపోయింది. ఇక నిఫ్టీ తొమ్మిది పాయింట్లు నష్టపోయి 17,203వద్ద స్థిరపడింది. ఎన్టీపీసీ (3.13%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.94%), టైటాన్ (1.85%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.74%), విప్రో (1.52%) బీఎస్ ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచింది. రిలయన్స్ (-1.94%), టాటా స్టీల్ (-1.34%), మారుతి సుజుకి (-0.82%), బజాజ్ ఫైనాన్స్ (-0.63%), సన్ ఫార్మా (-0.61%) టాప్ లూజర్స్ గా నిలిచింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..