Saturday, November 23, 2024

భారీ న‌ష్టాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్స్

భారీ న‌ష్టాల్లో ముగిశాయి నేటి స్టాక్ మార్కెట్స్. ఆసియా మార్కెట్లు బ‌ల‌హీనంగా ట్రేడ్ కావ‌డం వ‌ల్ల ఇన్వెస్ట‌ర్లు అమ్మ‌కాల‌కే మొగ్గు చూపారు. దాంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 889 పాయింట్లు కోల్పోయి 57,011కి పడిపోయింది. నిఫ్టీ 263 పాయింట్లు పతనమై 16,985కి దిగజారింది. ఐటీ, టెక్ మినహా అన్ని సూచీలు నష్టపోయాయి. ఇన్ఫోసిస్ (2.84%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.96%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (0.82%), సన్ ఫార్మా (0.61%), టీసీఎస్ (0.16%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ (-4.89%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-3.55%), హిందుస్థాన్ యూనిలీవర్ (-3.43%), టైటాన్ (-3.26%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-3.08%) టాప్ లూజర్స్ గా నిలిచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement