రెండో రోజు నష్టాలబాటలో ముగిశాయి స్టాక్ మార్కెట్లు. ఈరోజు ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు… ఆ తర్వాత కోలుకున్నాయి. రిలయన్స్, టీసీఎస్ వంటి బ్లూచిప్ కంపెనీల మద్దతుతో లాభాల్లోకి మళ్లాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 437 పాయింట్లు లాభపడి 55,818కి పెరిగింది. నిఫ్టీ 105 పాయింట్లు పెరిగి 16,628 వద్ద స్థిరపడింది. రిలయన్స్ (3.51%), బజాజ్ ఫిన్ సర్వ్ (2.88%), సన్ ఫార్మా (2.35%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.08%), టీసీఎస్ (1.98%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచింది. హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.69%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.51%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.03%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.80%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-0.49%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement