Saturday, November 23, 2024

భారీ లాభాల‌లో స్టాక్ మార్కెట్స్ ..

నేటి స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే స‌మ‌యానికి సెన్సెక్స్ 887పాయింట్లు లాభ‌ప‌డి 57,634కి పెర‌గ‌గా , నిఫ్టీ 264పాయింట్లు పుంజుకుని 17,177వ‌ద్ద స్థిర‌ప‌డింది. నేటి అన్ని సూచీలు లాభాల్లోనే ముగిశాయి. మెటల్ సూచీ 3 శాతానికి పైగా లాభపడగా… రియాల్టీ, బ్యాంకెక్స్ సూచీలు రెండు శాతానికి పైగా లాభపడ్డాయి. టాటా స్టీల్ (3.90%), యాక్సిస్ బ్యాంక్ (3.57%), ఐసీఐసీఐ బ్యాంక్ (3.51%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (2.57%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.48%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచింది. . ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం తక్కువగా ఉంటుందనే అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచాయి. దీంతో స్టాక్ మార్కెట్స్ భారీ లాభాల‌తో ముగిశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement