Thursday, October 3, 2024

భారీ న‌ష్టాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు భారీ న‌ష్టాల‌తో ముగిశాయి. ర‌ష్యా, ఉక్రెయిన్ యుద్ధం మ‌న దేశీయ స్టాక్ మార్కెట్ల‌పై తీవ్ర ప్ర‌భావాన్ని చూపుతోంది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,491 పాయింట్లు పతనమై 52,842కి పడిపోయింది. నిఫ్టీ 382 పాయింట్లు కోల్పోయి 15,863 వద్ద స్థిరపడింది. భారతి ఎయిర్ టెల్ (3.46%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.38%), టాటా స్టీల్ (1.12%), ఇన్ఫోసిస్ (0.93%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్. ఇండస్ ఇండ్ బ్యాంక్ (-7.63%), యాక్సిస్ బ్యాంక్ (-6.70%), మారుతి (-6.56%), బజాజ్ ఫైనాన్స్ (-6.37%), బజాజ్ ఫిన్ సర్వ్ (-6.27%) టాప్ లూజర్స్ గా నిలిచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement