దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్లు, గ్లోబల్ ముడి చమురు ధరలు దిగి వస్తున్న క్రమంలో సూచీలు అప్ ట్రెండ్‌లోకి వచ్చాయి. సెన్సెక్స్ 54వేల పాయింట్ల ఎగువకు చేరగా, నిఫ్టీ 16 వేల స్థాయిని అధిగమించింది. సెన్సెక్స్ 427 పాయింట్లు ఎగిసి 54178 వద్ద, నిఫ్టీ 143 పాయింట్లు లాభపడి 16132 వద్ద ముగిసాయి. ఆటో, ఐటీ, బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్ళ ధోరణి కనిపించింది. టైటన్, ఎల్ అండ్‌టీ, యూపీఎల్, హిందాల్కో, బీపీసీఎల్, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ, కెనరా బ్యాంకు, జూబ్లియంట్ ఫార్మా ఇండస్ ఇండ్, బీవోబీ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement