Saturday, November 23, 2024

భారీ లాభాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నేటి స్టాక్ మార్కెట్లు భారీ లాభాల‌తో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే భారీ లాభాల్లోకి వెళ్లిన సూచీలు… ఆ తర్వాత ఎక్కడా తగ్గలేదు. అమెరికా ద్రవ్యోల్బణం కొంత తగ్గుముఖం పట్టడం ఇన్వెస్టర్లలో జోష్ పెంచింది. ఈ కారణంగా అంతర్జాతీయంగా అన్ని మార్కెట్లు లాభాల్లో పయనించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 515 పాయింట్లు లాభపడి 59,332కి ఎగబాకింది. నిఫ్టీ 124 పాయింట్లు కోల్పోయి 17,659కి చేరింది. యాక్సిస్ బ్యాంక్ (2.75%), బజాజ్ ఫైనాన్స్ (2.36%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (2.32%), టెక్ మహీంద్రా (2.12%), టీసీఎస్ (1.98%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఐటీసీ (-1.56%), ఎన్టీపీసీ (-1.38%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.04%), భారతి ఎయిర్ టెల్ (-0.76%), మారుతి (-0.69%) టాప్ లూజర్స్ మిగిలాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement