దేశీయ స్టాక్మార్కెట్లు ఈరోజు లాభాలతో ముగిసాయి. వారాంతంలో బలమైన లాభాలతో స్థిరపడ్డాయి. సెన్సెక్స్ 303 పాయింట్లు ఎగిసి 54481 వద్ద, నిఫ్టీ 88 పాయింట్ల లాభంతో 16220 వద్ద ఉత్సాహంగా ముగిసాయి. అలాగే ఈ వారంలో ఇప్పటివరకు సెన్సెక్స్ దాదాపు 1,700 పాయింట్లు పెరగడం విశేషం. బ్రిటీష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్, యూకే డెవలప్మెంట్ ఫైనాన్స్ సంస్థతో ఎం అండ్ ఎం, ఈవీకో రూ.1,925 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో మహీంద్రా అండ్ మహీంద్రా షేరు ఆరంభంలో 5.4 శాతం పెరిగింది. కానీ చివర్లో లాభాలను కోల్పోయింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement