దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే భారీ లాభాల్లోకి వెళ్లిన మార్కెట్లు చివరి వరకు అదే ఊపును కొనసాగించాయి. అంతర్జాతీయ సానుకూలతలు, చైనాలో ఆంక్షల ఎత్తివేత, డాలర్ బలహీనత తదితర అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచాయి. దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,041 పాయింట్లు పెరిగి 55,925కి చేరుకుంది. నిఫ్టీ 309 పాయింట్లు లాభపడి 16,661కి ఎగబాకింది.
సాధారణం కంటే మూడు రోజుల ముందుగానే రుతుపవనాలు కేరళకు రానున్నాయని వాతావరణ శాఖ ఆదివారం ప్రకటించిన నేపథ్యంలో ఎఫ్ఎంసీజీ, ఆటో ఐటీ రంగాలు భారీ లాభాలనార్జించాయి. 4.22శాతం లాభంతో ఇన్ఫోసిస్ టాప్ గెయినర్‌గా నిలవగా, రియలన్స్, హెచ్డీఎఫ్సీ, ఎంఅండ్ఎం, యూపీఎల్, టాటా మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లాభపడ్డాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ :
టైటాన్ (4.94%), మహీంద్రా అండ్ మహీంద్రా (4.69%), ఇన్ఫోసిస్ (4.57%), ఎల్ అండ్ టీ (3.77%), టెక్ మహీంద్రా (3.59%).
టాప్ లూజర్స్:
కోటక్ మహీంద్రా బ్యాంక్ (-2.23%), సన్ ఫార్మా (-1.75%), డాక్టర్ రెడ్డీస్ (-0.73%), ఐటీసీ (-0.04%).
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1,041, నిఫ్టీ 309 పాయింట్లు
Advertisement
తాజా వార్తలు
Advertisement