నేడు స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు లాభాల్లోనే కొనసాగాయి. ఫైనాన్షియల్ పాలసీని బ్రిటన్ వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీంతో, వారు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 550 పాయింట్లు లాభపడి 58,961కి ఎగబాకింది. నిఫ్టీ 175 పాయింట్లు పెరిగి 17,487కి చేరుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.41%), ఐటీసీ (2.39%), నెస్లే ఇండియా (2.38%), భారతి ఎయిర్ టెల్ (2.25%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.95%)బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. హెచ్ డీ ఎఫ్ సీ లిమిటెడ్ (-0.72%), ఎన్టీపీసీ (-0.68%), టెక్ మహీంద్రా (-0.24%), సన్ ఫార్మా (-0.16%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.15%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement