Saturday, November 23, 2024

వరుసగా నాలుగవ రోజు లాభాలతో ముగిసిన -స్టాక్ మార్కెట్లు

నాలుగవ రోజు కూడా లాభాలతో ముగిశాయి స్టాక్ మార్కెట్లు. గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు దిగిరావడం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 147 పాయింట్లు లాభపడి 59,107కి చేరుకుంది. నిఫ్టీ 25 పాయింట్లు పెరిగి 17,512 వద్ద స్థిరపడింది. నెస్లే ఇండియా (2.14%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (2.13%), రిలయన్స్ (1.88%), ఐటీసీ (1.79%), యాక్సిస్ బ్యాంక్ (1.69%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా మిగిలాయి. ఎన్టీపీసీ (-1.77%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.64%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.56%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.41%), ఇన్ఫోసిస్ (-1.23%) టాప్ లూజర్స్ గా నిలిచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement