భారీ లాభాలతో ముగిశాయి స్టాక్ మార్కెట్స్. మెటల్ ఫార్మా, క్యాపిటల్ గూడ్స్ సూచీలు మార్కెట్లని ముందుండి నడిపించాయి. కాగా సెన్సెక్స్ 848పాయింట్లు లాభపడి 58,862కి చేరుకుంది. నిఫ్టీ 237 పాయింట్లు పెరిగి 17,576కి ఎగబాకింది. నేడు 1,683 షేర్లు అడ్వాన్స్ కాగా… 1,583 షేర్లు డిక్లైన్ అయ్యాయి. 98 షేర్లు ఎలాంటి మార్పు చెందలేదు. టాటా స్టీల్ (7.57%), సన్ ఫార్మా (6.94%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (5.76%), ఎల్ అండ్ టీ (4.31%), అల్ట్రాటెక్ సిమెంట్ (4.13%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచింది. మహీంద్రా అండ్ మహీంద్రా (-1.30%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.18%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.13%), భారతి ఎయిర్ టెల్ (-0.91%), ఎన్టీపీసీ (-0.60%) టాప్ లూజర్స్ గా నిలిచింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..