Tuesday, November 26, 2024

Stock Market: ఆర్బీఐ ప్రకటనతో లాభ పడిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఈరోజు భారీ లాభాలతో ముగిశాయి. కీలక వడ్డీరేట్లు యథాతథంగా ఉంచనున్నామన్న ఆర్‌బీఐ ప్రకటనతో న్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీంతో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,016 పాయింట్లు లాభపడి 58,650కి పెరిగింది. నిఫ్టీ 293 పాయింట్లు పుంజుకుని 17,470కి ఎగబాకింది.

ఉదయం సెన్సెక్స్‌ 58,158.56 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభం కాగా.. ఇంట్రాడేలో 58,702.65 వద్ద గరిష్ఠాన్ని తాకింది. అనంతరం 1,016.03 పాయింట్ల లాభంతో 58,649.68 వద్ద ముగిసింది. ఇక, 17,315.25 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ.. ఇంట్రాడేలో 17,484.60 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 291.65 పాయింట్లు లాభపడి 17,468.35 వద్ద స్థిరపడింది.

కొటాక్ మహీంద్రా బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌ మినహా మిగిలినవన్నీ లాభపడ్డాయి. బజాజ్‌ ఫినాన్స్‌, మారుతీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, సన్‌ఫార్మా, ఏషియన్‌ పెయింట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు లాభపడ్డాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement