దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. వరుసగా మూడు రోజుల పాటు లాభాల్లో దూసుకెళ్లిన మార్కెట్లు ఈ రోజు నష్టాలు మూటగట్టుకున్నాయి. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 190 పాయింట్లు నష్టపోయి 57,124కి పడిపోయింది. నిఫ్టీ 68 పాయింట్లు కోల్పోయి 17,003 వద్ద స్థిరపడింది.
నిఫ్టీలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఒఎన్‌జిసి, ఐచర్ మోటార్స్, ఎన్‌టిపిసి ఎక్కువగా నష్టపొగ.. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఏషియన్ పెయింట్స్, విప్రో ఎక్కువ లాభపడిన వాటిలో ఉన్నాయి. కాగా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటం మార్కెట్లపై ప్రభావాన్ని చూపింది.