Tuesday, November 26, 2024

న‌ష్టాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్స్

గ‌త మూడు రోజులుగా భారీ లాభాల‌తో దూస‌కుపోయిన స్టాక్ మార్కెట్లు నేడు న‌ష్టాల‌ను మూట‌క‌ట్టుకున్నాయి. ఈ ఏడాదిలో మొద‌టిసారి న‌ష్టాల‌ను చ‌వి చూశాయి. కాగా క‌రోనా కేసులు భారీగా పెర‌గ‌డం ఈ న‌ష్టాల‌కి కార‌ణ‌మ‌ని తెలుస్తుంది. క‌రోనా కేసులు భారీగా పెరుగుతుండ‌టంతో ఇన్వెస్ట‌ర్ల సెంటిమెంట్ పై ప్ర‌భావం ప‌డింది. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 621 పాయింట్లు నష్టపోయి 59,601కి పడిపోయింది. నిఫ్టీ 179 పాయింట్లు కోల్పోయి 17,745 వద్ద స్థిరపడింది. ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.74%), భారతి ఎయిర్ టెల్ (1.64%), మారుతి (1.13%), బజాజ్ ఫైనాన్స్ (0.67%), టైటాన్ (0.58%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. అల్ట్రాటెక్ సిమెంట్ (-2.58%), టెక్ మహీంద్రా (-2.42%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.01%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-2.01%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.87%) టాప్ లూజర్స్ గా నిలిచాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement