తెలంగాణ రైతులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సవతి తల్లిప్రేమను చూపుతోందని, ఈ విషయం మరోసారి బహిర్గతమైందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. యాసంగిలో తెలంగాణ అధికశాతం బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) మాత్రమే ఉత్పత్తి అవుతుందని కేంద్ర ప్రభుత్వానికి, ఎఫ్‌సీఐకి తెలిసినా రా రైస్ మాత్రమే కొంటామని మొండి వైఖరిని ప్రదర్శిస్తోందని విమర్శించారు.
రైతులు పండించే పంటను కొనకుండా, పండని పంటను కొంటామని ప్రకటించి బీజేపీ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ వ్యవసాయం గురించి ఏ మాత్రం అవగాహన లేని బండి సంజయ్.. యాసంగిలో రాష్ట్రంలో ఏ రకం బియ్యం దిగబడి వస్తుందో తెలుసుకోవాలని సూచించారు. ఆయనకు తెలియకపోతే రాష్ట్రంలో ఏ రైతును అడిగినా జ్ఞానోదయం చేస్తారని కవిత చురకలంటిచారు. బండి సంజయ్ మిడి మిడి జ్ఞానంతో రైతులకు తీవ్రంగా అన్యాయం జరుగుతోందని ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.