Saturday, November 23, 2024

విదేశీ ప్రయాణికులకు కొత్త రూల్స్.. ఐసొలేషన్ అవసరం లేదు.. హోం క్వారంటైన్ మస్ట్..

విదేశాల నుంచి ఇండియాకి వచ్చే ప్రయాణికులు కచ్చితంగా కొవిడ్ రూల్స్ పాటించాల్సిందేనని, సవరించిన మార్గదర్శకాల ప్రకారం కొవిడ్ టెస్ట్ నెగిటివ్ ఉన్నా హోం క్వారంటైన్ తప్పదని  అధికారులు తెలిపారు. భారతదేశానికి వచ్చే ప్రయాణికులకు నిర్దేశించిన ప్రామాణిక ప్రోటోకాల్ ప్రకారం తగిన చర్యలుంటాయన్నారు. అంతర్జాతీయ రాకపోకల మార్గదర్శకాలను నిన్న సవరించిన దాని ప్రకారం కొత్త నిబంధన ఈ రోజు నుంచి అమల్లోకి వస్తాయని అధికారులు వెల్లడించారు. ఈ రూల్స్, గైడ్ లైన్స్ తదుపరి ఆర్డర్ వెలువరించే వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.

డేంజర్ జోన్ లో ఉన్నవారుగా పరిగణించే వారితో సహా విదేశాల నుంచి  వచ్చే ప్రయాణికులను ఐసోలేషన్ లో ఉంచాలని, ఇప్పటిదాకా నిర్దేశించిన ప్రామాణిక ప్రోటోకాల్ ప్రకారం వారికి చికిత్స చేయాలని రూల్స్ ఉన్నాయి.  అయితే.. సవరించిన మార్గదర్శకాల్లో  మాత్రం ‘‘ఐసోలేషన్’’ లో ఉండాలనే కండిషన్ తొలగించినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కానీ, విదేశీయులు భారత్‌కు వచ్చిన 8వ రోజున నెగెటివ్‌గా వచ్చిన తర్వాత కూడా ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుందని కొత్త గైడ్ లైన్స్ లో పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement