216అడుగుల ఎతైన రామానుజాచార్య విగ్రహం చినజీయర్ స్వామి ఆశ్రమంలో సిద్ధమయింది. కాగా ఈ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించనున్నారు. కాగా ఈ మేరకు వచ్చే నెల 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు చినజీయర్ స్వామి ఆశ్రమంలో రామానుజాచార్య జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఆశ్రమం హైదరాబాద్ నుండి కర్నూల్ వెళ్లే దారిలో 30కి.మీ దూరంలో ముచ్చింతల గ్రామంలో నెలకొని ఉంది. రామానుజాచార్య 1000వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు చినజీయర్ స్వామి ఆశ్రమంలో అన్ని ఏర్పాట్లు చేశారు ఈ ఆశ్రమంలో 108 దేవాలయాలు నిర్మించారు.
ఈ ఉత్సవాల సందర్భంగా ఫిబ్రవరి 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ఆశ్రమానికి వచ్చి రామానుజాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. 8.9వ తేదీల్లో దేశ వ్యాప్తంగా ఉన్న సాధుసంతువులతో ‘‘ధర్మ సమ్మేళనం’’ నిర్వహిస్తారు. 10వ తేదీన సామాజిక సామారస్యత దృష్ట్యా ‘‘సామాజిక నేతల సమ్మేళనం’’ జరనున్నాయి. బంగారంతో రూపొందించిన రామానుజ విగ్రహాన్ని భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ 13వ తేదీన ఆవిష్కరించనున్నారు. 9వ తేదీన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ , 8,9,10 తేదీలలో భయ్యాజి జోషి, భాగయ్యలు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. మొత్తంగా ప్రతీ రోజు వేద పండితులతో వేదోచ్చారణ కార్యక్రమం నిర్వహిస్తారు. 1035 యజ్ఞ గుండాలలో యజ్ఞ, యాగాదులు వంటి అనేక ధార్మిక కార్యక్రమాలు చేస్తారు. ఈ యజ్ఞ యాగాదులను భక్తులు పాల్గొని సందర్శించవచ్చు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..