Friday, November 22, 2024

Telangana | చిగురుమామిడి పోలీస్ స్టేషన్​కు రాష్ట్రస్థాయి గుర్తింపు.. కేటగిరి-1లో 9వ స్థానం

కరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడి పోలీస్ స్టేషన్ కు రాష్ట్ర స్థాయి గుర్తింపు లభించిందని చిగురుమామిడి ఎస్సై సుధాకర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లను ఐదు విభాగాలుగా విభజించారు. దీనికి సంబంధించి నిన్న (మంగ‌ళ‌వారం) రాష్ట్ర పోలీస్ శాఖ ప్రకటించిన ర్యాంకుల్లో చిగురుమామిడి పోలీస్ స్టేషన్ మొదటి కేటగిరిలో తొమ్మిదవ స్థానం సంపాదించింది. రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లకు వార్షిక పని విధానాన్ని ఆధారం చేసుకుని ఈ ర్యాంకింగ్స్ ప్ర‌క‌టించారు.

  • వివిధ ఫంక్షనల్ వర్టికల్ లలో పోలీస్ స్టేషన్ సిబ్బంది యొక్క పని విధానం ఆధారంగా ర్యాంకులను ప్రకటించారు.. అందులో..
  • నేరాల నియంత్రణ
  • కేసుల‌ ఛేదన
  • ఇన్వెస్టిగేషన్
  • నేరస్తులకు జైలు శిక్ష పడేలా చేయడం
  • డయల్ 100కు పోలీసులు స్పందించిన విధానం.. బాధితులు సంతృప్తిని వ్యక్తపరిచిన విధానం
  • పోలీస్ స్టేషన్ నిర్వహణ విధానం
  • HRMS
  • పని ప్రదేశం యొక్క మేనేజ్మెంట్ (5’S’)
  • ట్రైనింగ్, పోలీసుల పని పద్ధతులను డిజిటలైజేషన్ చేయడం..
  • వివిధ పోలీస్ స్టేషన్ సిబ్బంది ప్రదర్శించిన ప్రతిభ ఆధారం చేసుకుని ర్యాంకులు ప్రకటించారు.

ఈ క్ర‌మంలో మొదటి కేటగిరీలోనీ 213 పోలీస్ స్టేషన్ లలో చిగురుమామిడి పోలీస్ స్టేషన్ 9వ స్థానం లో నిల‌వ‌డంపై ఎస్ఐ సంతోషం వ్య‌క్తం చేశారు. పోలీస్ స్టేషన్ ను అన్ని భాగాల్లో అభివృద్ధి చేసి మెరుగైన పని విధానాన్ని ప్రదర్శించి రాష్ట్రస్థాయిలో 9వ స్థానంలో నిలపడం పట్ల తిమ్మాపూర్ సీఐ శశిధర్ రెడ్డి, కరీంనగర్ రూరల్ ఏసీపీ కరుణాకర్ రావు, చిగురుమామిడి ఎస్ఐ డి.సుధాకర్‌తో పాటు సిబ్బంది ని అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement