2017లో వచ్చిన ట్యూబ్ లైట్ సినిమా సమయంలో తనకు వింత వ్యాధి వున్న విషయాన్ని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ బయటపెట్టినట్టు సమాచారం. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర వ్యాధుల్లో ఇది ఒకటి. తాజా వార్తల ప్రకారం సల్మాన్ ఖాన్ గత కొంత కాలంగా ‘ట్రిజెమినల్ న్యూరల్జియా’ అనే ప్రమాదకర వ్యాధితో బాధపడుతున్నారట. ఈ వ్యాధి వున్న వాళ్లల్లో ప్రధానంగా వుండే లక్షణాలు ఇలా వుంటాయట. నరాల సమస్య వల్ల కలిగే ఈ వ్యాధి వల్ల ఎక్కువ సేపు మాట్లాడినా మూతి వంకర్లు పోతుందని ముఖ నరాల వల్ల ముఖం భాగం చాలా నొప్పిని భరించలేకుండా వుంటుందట.అంతే కాకుండా బ్రేష్ చేసినా మేకప్ వేసుకున్నా విపరీతమైన నొప్పి వుంటుందని కొన్ని సందర్భాల్లో ఈ వ్యాధి వున్న వారు ఈ నొప్పిని భరించలేక ఆత్మహత్య కూడా చేసుకునే ప్రమాదం వుందని చెబుతున్నారు. ఇదే తరహా ఇబ్బందుల్ని గత కొంత కాలంగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎదుర్కొంటున్నారట. అయినా ఆ బాధని ఎక్కడా వ్యక్తం చేయకపోవడం గమనార్హం. ఇక ఈ వ్యాధితో బాధపడుతున్న సల్మాన్ కు చాలా సార్లు సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన కూడా కలిగిందని ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా సల్మాన్ ఖాన్ వెల్లడించడం పలువురిని షాక్ కు గురిచేస్తోంది.అయితే ఈ వింత వ్యాధి నుంచి తనని తాను కాపాడు కోవడం కోసం గత కొంత కాలంగా యుద్ధం చేస్తున్న సల్మాన్ ఖాన్ తాజాగా కొంత వరకు కోలుకున్నారట. పూర్తి స్థాయిలో ఈ వ్యాధి నుంచి బయటపడేందుకు సల్మాన్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement