తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ సభ్యులు. విఐపి బ్రేక్ దర్శనంలో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి ప్రణతి, తల్లి షాలిని.. పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ శ్రీవారిని దర్శించుకున్నారు. ఎన్టీఆర్ బిజీగా ఉండడం వల్ల తిరుమలకు వెళ్ళలేదు. అధికారులు వీరికి స్వాగతం పలికారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరిద్దరి క్యూట్ లుక్స్ ఎన్టీఆర్ అభిమానులని, నెటిజన్లని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఎన్టీఆర్ పిల్లలు ఎప్పుడు కనిపించినా వారి పిక్స్ ఇంటర్నెట్ లో క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..